ప్రతాపం చూపిన సికింద్రాబాద్ మహిళలు! | Women attack on Kallu compound | Sakshi
Sakshi News home page

ప్రతాపం చూపిన సికింద్రాబాద్ మహిళలు!

Nov 2 2014 1:58 PM | Updated on Sep 2 2017 3:46 PM

ప్రతాపం చూపిన సికింద్రాబాద్ మహిళలు!

ప్రతాపం చూపిన సికింద్రాబాద్ మహిళలు!

నగరంలోని మహిళలు తమ ప్రతాపం చూపారు. వెంగళరావు నగర్లోని కల్లు కాంపౌండ్పై దాడి చేశారు.

సికింద్రాబాద్: నగరంలోని మహిళలు తమ ప్రతాపం చూపారు. వెంగళరావు నగర్లోని కల్లు కాంపౌండ్పై దాడి చేశారు. ఈ రోజే ఇక్కడ కల్లు కాంపౌండ్ ప్రారంభించారు. ప్రారంభించిన  కొద్దిసేపటికే మహిళలు కాంపౌండ్పై దాడి చేశారు. కల్లు సీసాలను ధ్వంసం చేశారు. తమ బస్తీలో కల్లుకాంపౌండ్ వద్దని ఆందోళనకు దిగారు. మళ్లీ కల్లుకాంపౌండ్ తెరిచి తమ జీవితాలతో ఆడుకోవద్దని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ భర్తలు, పిల్లలు కల్తీ కల్లుకు బానిసలై జీవితాలను ఛిద్రం చేసుకుంటారని వారు భయాందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లోని మూడు కల్లు దుకాణాలను మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలిసి పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

**

Advertisement
 
Advertisement
Advertisement