నేడు మజ్లిస్ ఫ్లోర్ లీడర్ ఎంపిక | Today, the choice of the Majlis floor leader | Sakshi
Sakshi News home page

నేడు మజ్లిస్ ఫ్లోర్ లీడర్ ఎంపిక

Feb 10 2016 12:45 AM | Updated on Oct 8 2018 8:39 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీ గా అవతరించిన మజ్లిస్ పార్టీలో

దారుస్సలాంలో కార్పొరేటర్ల సమావేశం
ఎంఎ గఫార్ లేదా మహ్మద్ మెబీన్‌కు అవకాశం

 
 సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీ గా అవతరించిన మజ్లిస్ పార్టీలో ఫ్లోర్ లీడర్ ఎంపిక కీలకంగా మారింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో జరిగే కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫ్లోర్ లీడర్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థి పనితీరు, విధేయత, ప్రజల్లో గుర్తింపు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు.

అనుభవంతో నిమిత్తం లేకుండా కొత్త ముఖాలను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం 44 మంది అభ్యర్ధులు కార్పొరేటర్లుగా ఎంపిక కాగా, అందులో  35 మంది కొత్త వారే. కావడం గమనార్హం. సీనియర్ కార్పొరేటర్లు ఎంఎ గఫార్ (దూద్‌బౌలి) మహ్మద్ మెబీన్(రామ్నాస్‌పురా)ల్లో ఒకరిని ఫ్లోర్‌లీడర్‌గా ఎంపిక చేయవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement