కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు | Thammineni veerabhadram takes on kcr govt | Sakshi
Sakshi News home page

కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు

Sep 30 2015 9:13 AM | Updated on Aug 16 2018 3:23 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్లో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.... ఛలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో 5 వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపై పోలీసులు దాడిని ఆయన ఖండించారు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో వరంగల్ ఎన్కౌంటర్పై చర్చించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వరంగల్ ఎన్కౌంటర్ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయినా తాము ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని ప్రజా సంఘాల నేతలు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement