
క్యాన్సర్ చికిత్సలో ‘యశోద’ సరికొత్త రికార్డు
క్యాన్సర్ చికిత్సల్లో యశోద ఆస్పత్రి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అధునాతన‘రాపిడ్‌ఆర్క్’సాంకేతిక పరిజ్ఞానంతో
పది వేల మందికి రాపిడ్ ఆర్క్ పరిజ్ఞానంతో చికిత్స
సాక్షి, సిటీబ్యూరో : క్యాన్సర్ చికిత్సల్లో యశోద ఆస్పత్రి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అధునాతన‘రాపిడ్‌ఆర్క్’సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం లోనే అత్యధిక మంది క్యాన్సర్ బాధితులకు విజయవంతంగా రేడియో థెరపీ చికిత్స అందించి వైద్యరంగంలో సరికొత్త చరిత్రను సృష్టిం చింది. 2008 నుంచి ఇప్పటి వరకు 10126 మందికి ఈ పద్ధతిలో చికిత్స అందించగా, వీరిలో 3645 మంది తల, మెడ క్యాన్సర్ బాధితులు.2329 మంది బ్రెయిన్ క్యాన్సర్, 1722 మంది గర్భాశయ క్యాన్సర్, 1114 మంది రొమ్ము క్యాన్సర్, 506 మంది ఊపిరి తిత్తులు, పొత్తికడుపు క్యాన్సర్, మరో 354 మంది ఇతర క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించింది. ఇందు కోసం ప్రైవేటు రోగులు రూ. 3లక్షలకుపైగా ఖర్చు చేయగా, ఆరోగ్యశ్రీ అర్హులైన నిరుపేద రోగులకు ఇదే చికిత్సను రూ.30 వేలకు అందించినట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.
క్యాన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలి:
రాపిడ్ ఆర్క్ పరిజ్ఞానంతో ప్రపంచంలోనే అత్యధిక మందికి చికిత్స చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో వేడుకలు నిర్వహించారు. సినీహీరో దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. బ్రెయిన్ ట్యూమర్(మెడిలో బ్లాస్టోమా)తో బాధపడుతూ రాపిడ్ ఆర్క్ పరిజ్ఞాన ంతో అందించిన చికిత్స వల్ల పూర్తిగా కోలుకున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన నివేదిత(3) చదువు కోసం రూ.2 లక్షల చెక్కును అందజేశారు. క్యాన్సర్ వల్ల తన కుటుంబం కూడా చాలా నష్టపోయిందని, తనకు ఎంతో ఇష్టమైన తాత రామానాయుడు కూడా క్యాన్సర్ వల్లే చనిపోయారని రానా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రూ.200 కోట్లతో త్వరలో ప్రోటాన్ థెరపీ:
క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన చికిత్సను అందింజేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేసి త్వరలో ప్రోటాన్ థెరపీ, త్రిబుల్ ఎఫ్, వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబుటులోకి తీసుకురానున్నట్లు యశోద ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ జిఎస్‌రావు చెప్పారు. యశోద ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్.చంద్రశేఖర్, వెరి యన్ మెడికల్ సిస్టమ్స్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ లూకా కొజ్జి పాల్గొన్నారు.