దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితుల్లో ఐదుగురికి ఉరి శిక్ష విధిస్తూ ఈ నెల 19న ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేసే విషయం లో
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టును కోరిన ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితుల్లో ఐదుగురికి ఉరి శిక్ష విధిస్తూ ఈ నెల 19న ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేసే విషయం లో సంబంధిత కోర్టు జడ్జి కేసును ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్. కె.జైశ్వాల్‌ల ధర్మా సనం సోమవారం విచారించింది. ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుపై సత్వర విచారణ చేపట్టా లని కోరారు.
ఇదే సమయంలో కింది కోర్టు తమకు విధించిన ఉరిశిక్షను సవాలు చేస్తూ అసదుల్లా అక్తర్, జియావుర్ రెహ్మాన్, మహ్మద్ తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్‌లు అప్పీల్ దాఖలు చేశారని వారి తరఫు న్యాయవాది మహదేవన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి హైకోర్టు రిజిస్ట్రీ ఇంకా నం బర్ కేటాయించలేదన్నారు. దీంతో ధర్మాసనం ఉరిశిక్ష ఖరారు కేసుతో పాటు ఈ అప్పీల్‌ను కూడా జత చేయాలని, నంబర్ కేటాయించిన తరువాత రెండింటినీ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.