విద్యార్థుల ఆందోళన: కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం | student protest in front of college in chaitanyapuri | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆందోళన: కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం

Jul 23 2016 10:59 AM | Updated on Nov 9 2018 4:32 PM

చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. సెలవులు అడిగినందుకు కాలేజీ సిబ్బంది తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు. అందుకు నిరసనగా ఆందోళనకు దిగినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సదరు విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. 

విద్యార్థులకు సంఘీభావంగా వారు కూడా ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో విద్యార్థులు కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దాంతో కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలో దిగి.. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement