హిజ్రాల కోసం వెళ్తే.. సాఫ్ట్ వేర్‌లు దొరికారు..! | software engineers captured by jubilee hills police | Sakshi
Sakshi News home page

హిజ్రాల కోసం వెళ్తే.. సాఫ్ట్ వేర్‌లు దొరికారు..!

Aug 3 2015 7:20 PM | Updated on Oct 22 2018 7:50 PM

హిజ్రాల కోసం వెళ్తే.. సాఫ్ట్ వేర్‌లు దొరికారు..! - Sakshi

హిజ్రాల కోసం వెళ్తే.. సాఫ్ట్ వేర్‌లు దొరికారు..!

అర్థరాత్రి రోడ్ల పక్కన నిలబడి వాహనదారులను, పాదచారులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న హిజ్రాలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు.

బంజారాహిల్స్: అర్థరాత్రి రోడ్ల పక్కన నిలబడి వాహనదారులను, పాదచారులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న హిజ్రాలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదు మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పోలీసులకు చిక్కారు. వీరంతా హిజ్రాల కోసం వచ్చి వారితో మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5 లోని అన్నపూర్ణ స్టూడియో, ఏడెకరాల మధ్య ఉన్న రోడ్డులో ఈ కార్యకలాపాలు జరుగుతుండటంతో పాటు గొడవలు నిత్యకృత్యంగా మారాయి.

ఇందిరానగర్ - శ్రీకృష్ణానగర్ గడ్డ మీది నుంచి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కార్యాలయం మీదుగా జూబ్లీహిల్స్‌వైపు వెళ్లే రోడ్డులో నిత్యం హిజ్రాలు మాటువేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement