మేడిపల్లిలో దొంగల హల్‌చల్ | robbers hulchul in medipally | Sakshi
Sakshi News home page

మేడిపల్లిలో దొంగల హల్‌చల్

Aug 8 2016 10:57 AM | Updated on Aug 30 2018 5:27 PM

సైబరాబాద్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దొంగలు తెగబడ్డారు.

హైదరాబాద్: సైబరాబాద్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దొంగలు తెగబడ్డారు. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్కెట్ చేసిన దొంగలు.. రెండిళ్లలో ప్రవేశించి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకు పోయారు. అలాగే, పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని ఓ దుకాణం షట్టర్లు తొలగించి, రూ.5 లక్షల విలువైన సామగ్రిని దోచుకున్నారు. సోమవారం ఉదయం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement