బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లో తాగుబోతుల వీరంగం సృష్టించారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లో తాగుబోతుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ కారును స్థంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదస్థలంలోనే కారును వదిలేసి ఆసుపత్రికి వెళ్లారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కారు నెంబర్‌ప్లేట్లు తొలగించారు. దీంతో ఇది పెద్దవాళ్లకు సంబంధించిన వ్యవహారమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. నెంబర్ ప్లేట్లు పోలీసులు తొలగించారా లేక గాయపడిన వారే తొలగించారనేది తెలియాల్సి ఉంది.