ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నం | ration dealers protest at pragathi bhavan | Sakshi
Sakshi News home page

ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నం

Jun 30 2017 11:39 AM | Updated on Sep 5 2017 2:52 PM

రేషన్‌ డీలర్లను ఉద్యోగులుగా గుర్తించి వారి సమస్యలు తీర్చాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించిన రేషన్‌ డీలర్లను పోలీసులు అడ్డుకున్నారు.

- రేషన్‌ డీలర్లు అరెస్ట్‌
 
హైదరాబాద్‌: రేషన్‌ డీలర్లను ఉద్యోగులుగా గుర్తించి వారి సమస్యలు తీర్చాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించిన రేషన్‌ డీలర్లను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ డీలర్లు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి నివాస గృహమైన ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు.
 
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడే రేషన్‌ డీలర్లను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌, ముదోల్‌, ఆసిఫాబాద్‌, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, సూర్యాపేట, కోదాడ, సత్తుపల్లి, జనగామలో రేషన్‌ డీలర్లను ముందస్తుగా అరెస్ట్‌ చేయడంతో వారి ప్రయత్నం విఫలమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement