నిలకడగా ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం | ram reddy venkat reddy health is fine now | Sakshi
Sakshi News home page

నిలకడగా ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం

Feb 21 2016 3:29 AM | Updated on Sep 3 2017 6:03 PM

నిలకడగా ఎమ్మెల్యే  రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం

నిలకడగా ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం

అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీమంత్రి ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి(74) ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు శనివారం తెలిపారు.

హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీమంత్రి ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి(74) ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు శనివారం తెలిపారు. ఆయన జ్వరం, ఫిట్స్‌తో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా  ఆయన ఊపిరితిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. జ్వరం, ఫిట్స్ రావడంతో తాజాగా ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వెంకటరెడ్డి శరీరం చికిత్సకు సహకరిస్తోందని, మరో 3 రోజులు గడిస్తే పూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement