మిషన్‌ భగీరథ ప్రధాన పనులు పూర్తి | prasanth reddy on mission bhagiratha | Sakshi
Sakshi News home page

మిషన్‌ భగీరథ ప్రధాన పనులు పూర్తి

Feb 21 2018 1:34 AM | Updated on Feb 21 2018 1:34 AM

prasanth reddy on mission bhagiratha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ ప్రధాన పనులు పూర్తయినందున ఇక నుంచి ఇంట్రా(అంతర్గత సరఫరా) పనుల మీద దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇంట్రా పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రధాన పనులు చేసిన వర్క్‌ ఏజెన్సీల సహకారం తీసుకుంటామని చెప్పారు.

వేముల ప్రశాంత్‌రెడ్డి మిషన్‌ భగీరథపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా అయిన ఇంట్రా పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్రా పనుల కోసం ప్రత్యేకంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈలు ఉన్నందున పనుల్లో మరింత వేగం చూపించాలని చీఫ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంట్రా విలేజ్‌ పనులు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement