నకిలీ విత్తన కంపెనీలపై కేసులు పెట్టాలి | Ponguleti Sudhakar reddy comments on Fake seeds | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తన కంపెనీలపై కేసులు పెట్టాలి

Oct 19 2016 2:34 AM | Updated on Sep 17 2018 8:11 PM

నకిలీ విత్తన కంపెనీలపై కేసులు పెట్టాలి - Sakshi

నకిలీ విత్తన కంపెనీలపై కేసులు పెట్టాలి

నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

పొంగులేటి డిమాండ్

 సాక్షి, హైదరాబాద్:
నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరుసగా నాలుగేళ్లపాటు కరువు, ఇటీవల కురిసిన భారీవర్షాలతో రైతుల పరిస్థితి కుదేలు అయిందన్నారు.

ఈ ప్రభుత్వం ప్రకటనలు తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలనిచ్చి కంపెనీలు కోట్ల రూపాయలు రైతుల నుంచి దోచుకున్నాయని పొంగులేటి ఆరోపించారు. సమస్యలను చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని, ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement