పోలీసు క్రీడాకారులకు డీజీపీ ప్రశంస | Police DGP admiration for athletes | Sakshi
Sakshi News home page

పోలీసు క్రీడాకారులకు డీజీపీ ప్రశంస

Mar 1 2016 12:30 AM | Updated on Sep 3 2017 6:42 PM

పోలీసు క్రీడాకారులకు డీజీపీ ప్రశంస

పోలీసు క్రీడాకారులకు డీజీపీ ప్రశంస

సౌత్ ఏషియన్ కబడ్డీ పోటీల్లో భారత్ ప్రథమ బహుమతి సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన రాష్ట్ర పోలీసు అధికారులను డీజీపీ అనురాగ్‌శర్మ ప్రశంసించారు.

 ఎస్సై మహేందర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన అనురాగ్‌శర్మ

 సాక్షి, హైదరాబాద్: సౌత్ ఏషియన్ కబడ్డీ పోటీల్లో భారత్ ప్రథమ బహుమతి సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన రాష్ట్ర పోలీసు అధికారులను డీజీపీ అనురాగ్‌శర్మ ప్రశంసించారు. కబడ్డీ జట్టుకు నాయకత్వం వహించిన రాష్ట్ర స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.మహేందర్‌రెడ్డిని డీజీపీ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు.

ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు అస్సాం రాజధాని గువాహటిలో జరిగిన 12వ సౌత్ ఏషియన్ కబడ్డీ పోటీల్లో భారత్‌కు ప్రథమ బహుమతి లభించింది.  ఫైనల్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌ను భారత జట్టు చిత్తుచేసింది. దేశానికి నాయకత్వం వహించిన మహేందర్‌రెడ్డితో పాటు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అహ్మద్, అసిస్టెంట్ కోచ్ రమణారెడ్డి, బెటాలియన్ ఐజీ శ్రీనివాసరావులను ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement