డ(బు)ల్ డెక్కర్ | Sakshi
Sakshi News home page

డ(బు)ల్ డెక్కర్

Published Mon, Jul 21 2014 2:00 AM

డ(బు)ల్ డెక్కర్ - Sakshi

 ప్రయాణికులు లేక ఖాళీగా రైలు పరుగులు
 
 సాక్షి, హైదరాబాద్: రెండునెలల క్రితం అట్టహాసంగా పట్టాలెక్కిన డబుల్ డెక్కర్ రైలు సర్వీసుల విషయంలో రైల్వే శాఖ పునరాలోచనలో పడింది. ఈ సూపర్‌ఫాస్ట్ అధునాతన డబుల్ డెక్కర్ రైలు రైల్వేకు భారీ నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో దీనిపై సమగ్ర సమీక్ష జరపాలని రైల్వే శాఖ నిర్ణయించడంతో.. ఈ సర్వీసులు ఎంతకాలం కొనసాగుతాయోననే అనుమానాలు మొదలయ్యాయి. హైదరాబాద్ (కాచిగూడ స్టేషన్) నుంచి తిరుపతి, గుంటూరులకు వారానికి రెండు రోజులు చొప్పున ఈ రైలు నడుస్తోంది. సర్వీసులు మొదలై రెండు నెలలు గడుస్తున్నా రెండు రూట్లలో ఆక్యుపెన్సీ రేటు (ప్రయూణికుల శాతం) ఏమాత్రం ఆశాజనకంగా లేదు. జూన్‌లో తిరుపతి సర్వీసు సరాసరి ఆక్యుపెన్సీ 48 శాతంగా నమోదైంది. అదే గుంటూరు సర్వీసు విషయంలో కేవలం 30 శాతంగా నమోదైంది. జూలైకొచ్చేసరికి ఆక్యుపెన్సీ మరింత దిగజారింది. ఓవైపు ఈ మార్గాల్లో నడిచే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్లు దొరకక ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా బస్సుల వైపు చూస్తున్నారు. కానీ డబుల్ డెక్కర్ రైలు సర్వీసులను మాత్రం పట్టించుకోవటం లేదు. భారీ నష్టాలను తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు తొలుత వాటి సమయాలను మార్చాలని, అరుునా తీరుమారకుంటే అవి నడిచే రోజులను మార్చాలని, ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకుంటే వారానికి ఒకరోజు చొప్పునే నడపాలని భావిస్తున్నట్టు తెలిసింది. అప్పటికీ ఆక్యుపెన్సీ ఆశించిన విధంగా లేకుంటే ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement