యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.....బుధవారం ఉదయం నేరేడ్‌మెట్ చౌరస్తాలో స్కూటిపై వెళుతున్న యువతి (21) పట్ల మౌలాలికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ సలీం (25) అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సలీంపై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.