
కేన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ బర్త్‌డే వేడుకలు
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన 55వ జన్మదినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో కేన్సర్‌పై పోరాడుతున్న చిన్నారులు, అభిమానుల మధ్య జరుపుకొన్నారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన 55వ జన్మదినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో కేన్సర్‌పై పోరాడుతున్న చిన్నారులు, అభిమానుల మధ్య జరుపుకొన్నారు. కేన్సర్ బాధిత చిన్నారులతో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్, అనంతపురానికి చెందిన అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలకృష్ణ సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కార్యకర్తలను, అభిమానులను అభినందించారు.
ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసిన బాలకృష్ణ ఆ తర్వాత ‘కేన్సర్ రహిత సమాజం.. మనందరి లక్ష్యం’ అన్న పేరుతో తయారు చేసిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రికి తాను చైర్మన్‌గా సేవలు చేసే భాగ్యం కలగడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆస్పత్రి సీఈవో ఆర్పీ. సింగ్, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ టి.ఎస్.రావు, సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.