ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. వికారాబాద్లోని ఫామ్హౌస్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి నాలుగు గంటల వరకూ ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని ఫిల్మ్ఛాంబర్లో ఉంచుతారు. అనంతరం ఆయన నివాసానికి తరలిస్తారు. కాగా ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఎక్కడ జరిపేది ఈరోజు సాయంత్రం ఆయన కుటుంబసభ్యులు నిర్ణయిస్తామని నటుడు అనంత్ తెలిపారు.
మరోవైపు ఎంఎస్ మృతిపై కొండాపూర్ కిమ్స్ వైద్యులు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మధుమేహం, గుండెపోటుతో ఎంఎస్ ఆస్పత్రిలో చేరారని, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు పని చేయకపోవటంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఉదయం 9.40 నిమిషాలకు ఎంఎస్ తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు.