గల్ఫ్లో జరిగే బతుకమ్మ సంబరాల్లో ఎంపీ కవిత పాల్గొంటోంది.
బతుకమ్మ సంబురాల్లో భాగంగా ఈ రోజు గల్ఫ్‌లోని ఉమ్ అల్ క్వయిన్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి వెళ్లిన కవితకు దుబాయ్‌లో అక్కడి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.