చర్లపల్లి జైలులో భానుకిరణ్ నుంచి 'బాటిల్స్' స్వాధీనం | Liquor bottles seized in cherlapally jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలులో భానుకిరణ్ నుంచి 'బాటిల్స్' స్వాధీనం

Jan 9 2016 10:41 AM | Updated on Jul 18 2019 2:26 PM

చర్లపల్లి జైలులో భానుకిరణ్ నుంచి 'బాటిల్స్' స్వాధీనం - Sakshi

చర్లపల్లి జైలులో భానుకిరణ్ నుంచి 'బాటిల్స్' స్వాధీనం

చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు శనివారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు శనివారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానస్ బ్యారక్ లో 10 మందు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అయితే ఈ బాటిళ్లు మద్దెల చెరువు సూరి హత్యకేసులో నిందితుడు భానుకిరణ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

భాను కిరణ్ వద్ద నుంచి సదరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని  పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. భాను కిరణ్కి మద్యం బాటిళ్లు ఎవరు అందజేశారు అనే అంశంపై ఉన్నతాధికారులు జైలు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాగా జైలులో మందు బాటిళ్లు దొరకడంపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement