విద్యుత్ పొదుపును ప్రోత్సహించడం కోసం త్వరలోనే ప్రతి ఇంటికి ఎల్‌ఈడీ బల్బులు వచ్చేలా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్: విద్యుత్ పొదుపును ప్రోత్సహించడం కోసం త్వరలోనే ప్రతి ఇంటికి ఎల్‌ఈడీ బల్బులు వచ్చేలా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. గురువారం తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్‌తో కేంద్రమంత్రి పియుష్ గోయల్ భేటీ అయ్యారు.
నిరంతర విద్యుత్‌ను అందించే ఉదయ్ పథకంలో చేరుతామని అన్నారు. త్వరలోనే ఉదయ్‌పై కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు కేసీఆర్ తెలిపారు.