తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ కు ఖైరతాబాద్ గణేషుడు | Khairatabad ganesh reach Telugu talli flyover | Sakshi
Sakshi News home page

తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ కు ఖైరతాబాద్ గణేషుడు

Sep 9 2014 12:54 PM | Updated on Sep 2 2017 1:07 PM

నగరంలో రెండోరోజు కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఖైరతాబాద్ వినాయకుడు మంగళవారం మధ్యాహ్నానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు.

హైదరాబాద్ : నగరంలో రెండోరోజు కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఖైరతాబాద్ వినాయకుడు మంగళవారం మధ్యాహ్నానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు. అలాగే నిమజ్జనానికి గణనాధులు ఎన్టీఆర్ మార్గ్ వైపు భారీగా కొలువు తీరారు. దాంతో అధికారులు నిమజ్జం చేసేందుకు వినాయకులను ట్యాంక్బండ్ వైపు ఉన్న క్రేనుల వద్దకు తరలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు భారీ గణనాధుడి నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరవాసులు తరలి రావటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.  దాంతో ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయింది. ఇక సచివాలయం వెళ్లేవైపు రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్ మీదగా రాకపోకలను అనుమతి ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement