రేపు ముంబై వెళ్లనున్న కేసీఆర్ బృందం | KCR and harish rao team will go to maharastra | Sakshi
Sakshi News home page

రేపు ముంబై వెళ్లనున్న కేసీఆర్ బృందం

Mar 6 2016 5:46 PM | Updated on Oct 8 2018 6:22 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం రేపు మహారాష్ట్ర వెళ్లనుంది.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ బృందం రేపు మహారాష్ట్ర వెళ్లనుంది. రేపు ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, అధికారుల బృందం ముంబై వెళ్లనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మంగళవారం మహారాష్ట్ర సర్కార్ తో చర్చించి తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకోనుంది. అనంతరం ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, అధికారుల బృందం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవనున్నట్లు సమాచారం అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement