ఆర్‌ఆర్‌సీ పరీక్షలకు జనసాధారణ్ రైళ్లు | Jansadharan trains for RRB exams | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌సీ పరీక్షలకు జనసాధారణ్ రైళ్లు

Nov 15 2014 1:37 AM | Updated on Sep 2 2017 4:28 PM

ఆర్‌ఆర్‌సీ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ-సికింద్రాబాద్ మధ్య జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్..

సాక్షి, హైదరాబాద్: ఆర్‌ఆర్‌సీ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని  కాకినాడ-సికింద్రాబాద్ మధ్య జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు  ఈ నెల 15, 22, 29 తేదీలలో మధ్యాహ్నం 3.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మురుసటి రోజు ఉదయం 3.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-కాకినాడ (07206) రైలు ఈ నెల 16, 23, 30 తేదీలలో రాత్రి 9.45కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35కి కాకినాడ చేరుకుంటుంది.
 
ధారూర్‌లో హాల్టింగ్...
రంగారెడ్డి జిల్లా ధారూర్  మెథడిస్ట్ చర్చ్ వద్ద జరగనున్న క్రిస్ట్‌మస్ జాతరను దృష్టిలో ఉంచుకొని రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ధారూర్‌లో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. నాందేడ్ నుంచి బెంగళూరుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ (16593/16594)మధ్యాహ్నం 3.26 గంటలకు ధారూర్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుంది. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే సమయంలో మధ్యాహ్నం 1.02 గంటలకు ధారూర్ చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (17429/17430) హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు సాయంత్రం 5.40 గంటలకు, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఉదయం 5.10 గంటలకు ఒక నిమిషం పాటు ధారూర్‌లో ఆగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement