జైల్లో భాను వద్ద మద్యం...బిర్యానీ...సెల్ ఫోన్... | Jail Director General raids in Cherlapally Central Jail | Sakshi
Sakshi News home page

జైల్లో భాను వద్ద మద్యం...బిర్యానీ...సెల్ ఫోన్...

May 3 2014 10:34 AM | Updated on Sep 2 2017 6:53 AM

జైల్లో భాను వద్ద మద్యం...బిర్యానీ...సెల్ ఫోన్...

జైల్లో భాను వద్ద మద్యం...బిర్యానీ...సెల్ ఫోన్...

నగరంలోని చర్లపల్లి జైల్లులో జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) కృష్ణంరాజు గత అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నగరంలోని చర్లపల్లి జైల్లులో జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) కృష్ణంరాజు గత అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మద్దిలచెరువు సూరీ హత్య కేసులో ప్రధాన నిందితుడు బానుకిరణ్, మహ్మద్ పహిల్వాన్, యాదగిరిల వద్ద ఉన్న మద్యం బాటిళ్లు, బిర్యానీ పాకెట్లు, సెల్ పోన్లు, భారీగా నగదును డీజీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చర్లపల్లి జైలు సూపరింటెండెంట్తోపాటు జైలు సిబ్బందిపై డీజీ నిప్పులు చెరిగారు.

 

గట్టి నిఘా ఉన్న జైలులోకి 'అవి' ఎలా వస్తున్నాయాంటూ  మండిపడ్డారు. వెంటనే వివరణ ఇవ్వాలని సదరు అధికారులను ఆయన ఆదేశించారు. అందుకు అధికారులు మీనామేషాలు లెక్కపెట్టారు. దాంతో డీజీ కృష్ణం రాజు అక్కడికక్కడే జైలు సూపరింటెండెంట్తోపాటు మరికొంత మంది ఉన్నతాధికారులకు ఛార్జీ మెమోలు జారీ చేశారు. ఖైదీలకు మద్యం, సెల్ ఫోన్లు, బిర్యానీ పాకెట్లు జైలు సిబ్బంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగమేఘాలపై అందజేస్తున్నారని సమాచారం. అయితే జైలు సిబ్బంది కష్టాన్ని గుర్తించిన ఖైదీలు పెద్ద మొత్తంలో నజరానాలు ఇస్తున్నారని వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement