ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యకర్తలు ...
బంజారాహిల్స్: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్-12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే రేవంత్‌రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. నినాదాలు చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు.
తక్షణం మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో తెలంగాణ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఓయూ ఇన్‌ఛార్జి అలెగ్జాండర్, నగర ఇన్‌చార్జి కొంగరి శంకర్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకటేశ్ తదితరులున్నారు.