పాత బోయినపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. రాజేష్ కుమార్ అనే నగల వ్యాపారి ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి సుమారు అర కిలో బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
హైదరాబాద్ : పాత బోయినపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. రాజేష్ కుమార్ అనే నగల వ్యాపారి ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి సుమారు అర కిలో బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఓ శుభకార్యం నిమిత్తం రాజేష్ కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోని వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఇంట్లో దాచిన నగలు మాయమయ్యాయి.
రాజేష్‌కు ఓ జ్యువెలరీ షాపు ఉంది. ప్రతీ రోజూ నగలను ఇంటిలో దాచి వెళ్తుండటం గమనించి ఈ పనికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనాస్థలానికి డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ బృందాలను తెప్పించి ఆధారాలు సేకరిస్తోన్నారు.