ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ | greater Hyderabad elections polling completed peacefully | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Feb 2 2016 5:05 PM | Updated on Sep 17 2018 6:08 PM

చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

హైదరాబాద్‌: చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలవరకు కొనసాగింది. గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది.

సాయంత్రం ఐదు గంటలవరకు క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు 42.56 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ శాతానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సాయంత్రం 6.30 గంటలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement