ఐడీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈద | edha shankarreddy takes charge as idc chairman | Sakshi
Sakshi News home page

ఐడీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈద

Oct 26 2016 6:16 PM | Updated on Sep 4 2017 6:23 PM

ఐడీసీ ఛైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

- హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు
హైదరాబాద్:
ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(ఐడీసీ) ఛైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్ ఐడీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావుతో పాటు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, మనోహర్‌రెడ్డి, సతీష్‌కుమార్, శోభ, ఇతర నేతలు హాజరయ్యారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు శంకర్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుముచిత స్ధానం కల్పిస్తున్నారని తెలిపారు. శంకర్‌రెడ్డి తొలినుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారని, ఆయన్ను ఐడీసీ ఛైర్మన్‌గా నియమించి నీటి పారుదల శాఖకు కేసీఆర్ మరింత బలోపేతం చేశారన్నారు. కాంగ్రెస్ హాయంలో ఎత్తిపోతల పథకాలన్నీ మూలనపడ్డాయని, ప్రస్తుతం వాటన్నింటినీ పునరుధ్దరించిన చివరి ఆయకట్టుకు నీరందించాల్సిన బాధ్యత ఐడీసీపై ఉందన్నారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటించి ఎత్తిపోతల పథకాలన్నింటినీ సమర్ధంగా పనిచేసేలా శంకర్‌రెడ్డి కృషి చేస్తారనే నమ్మకం తనకుందని తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని, వారికి ఎప్పుడూ సుముచిత గౌరవం దక్కుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి శంకర్‌రెడ్డి కృషి చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement