కిర్లంపూడి బయలుదేరిన దాసరి | dasari narayana rao to Visit Kirlampudi to Support Mudragada | Sakshi
Sakshi News home page

కిర్లంపూడి బయలుదేరిన దాసరి

Feb 7 2016 11:17 PM | Updated on Sep 3 2017 5:08 PM

కిర్లంపూడి బయలుదేరిన దాసరి

కిర్లంపూడి బయలుదేరిన దాసరి

కాపుల రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి బయలుదేరారు.

హైదరాబాద్ :  కాపుల రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి బయలుదేరారు. రోడ్డుమార్గంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన దాసరి నారాయణరావు సోమవారం ఉదయం కిర్లంపూడి చేరుకుంటారు. అయితే దాసరి నారాయణరావు బయలుదేరిన విషయాన్ని గమనించిన పోలీసులు ఆయన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఆ క్రమంలో కృష్ణాజిల్లా నందిగామ, జగ్గయ్యపేటలో భారీగా పోలీసులు మోహరించారు.

ఆ విషయంపై దాసరికి సమాచారం అందడంతో ఆయన వాహనాన్ని మరో మార్గం ద్వారా కిర్లంపూడికి చేరనున్నారని తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో శాంతి భద్రతల సమస్య నెలకొందని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు ఎవరు రావద్దని పోలీసులు నాయకులతోపాటు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందులోభాగంగా పోలీసులు దాసరిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement