దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు | Damodara Rajarasimha commented on KCR | Sakshi
Sakshi News home page

దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు

May 3 2017 2:06 AM | Updated on Sep 27 2018 8:33 PM

దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు - Sakshi

దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు

సుందిళ్ల బ్యారేజీ కోసం గోలివాడలో రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా సేకరిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు.

కేసీఆర్‌ నియంత.. నిరసనలను జీర్ణించుకోలేరు: దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్‌: సుందిళ్ల బ్యారేజీ కోసం గోలివాడలో రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా సేకరిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వమే దళారీగా మారిపోయి, రైతుల భూములను దోచుకుంటున్నదన్నారు. రైతుల పట్టా భూములపై ప్రభుత్వ పెత్తనం ఏందని ఆయన ప్రశ్నించారు.

ఏ చట్టం ద్వారా తమ భూములు తీసుకుంటున్నారో, రైతులకు ఇస్తున్న పరిహారం ఏమిటో  చెప్పాలని అడుగుతుంటే ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్‌ ప్రభుత్వం తాబేదారుగా మారిందని దామోదర విమర్శించారు. కేసీఆర్‌ ఒక నియంత అని విమర్శించారు. నియంతలే నిరసనలను జీర్ణించుకోలేరని, అందుకే ధర్నాచౌక్‌ను తరలిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement