
క్రాస్‌ఫిట్
జిమ్‌లూ వర్కవుట్లూ ఓకే. కానీ ఈ బాల్సూ, టైర్లూ ఏంటి? రోప్సూ, రాడ్సూ కనపడుతున్నాయేంటి? హే వ్వాట్స్ హ్యాపెనింగ్ హియర్? క్యూరియాసిటీ అనే వెయిట్‌ని పెంచుకోవడం కన్నా అర్జెంటుగా దించుకోవడం మిన్న అనుకుని ఎదురుగా కష్టపడుతున్న వర్ధమాన హీరో హర్షని అడిగేస్తే.
ఓ అమెరికన్ వర్కవుట్
జిమ్‌లూ వర్కవుట్లూ ఓకే. కానీ ఈ బాల్సూ, టైర్లూ ఏంటి? రోప్సూ, రాడ్సూ కనపడుతున్నాయేంటి? హే వ్వాట్స్ హ్యాపెనింగ్ హియర్? క్యూరియాసిటీ అనే వెయిట్‌ని పెంచుకోవడం కన్నా అర్జెంటుగా దించుకోవడం మిన్న అనుకుని ఎదురుగా కష్టపడుతున్న వర్ధమాన హీరో హర్షని అడిగేస్తే... ‘‘దీన్ని క్రాస్‌ఫిట్ వర్కవుట్ అంటారు. అమెరికన్ స్టైల్ ఎక్సర్‌సైజ్. ముంబైలో ఇజాజ్‌ఖాన్ అనే హిందీ నటుడు పరిచయం చేశాడు ’’ అని ఆయాసపడుతూ చెప్పాడు. దీని పుట్టు పూర్వోత్తరాలెందుకు గానీ... దీని వల్ల వచ్చే బెని‘ఫిట్’ ఏమిటో చెప్పమని అడిగితే ‘అయితే ఓకే’ అన్నాడు. సో... ఈ రోజు సెలబ్ ట్రైనర్ చెబుతున్న కొత్త వర్కవుట్ విశేషాల్లోకి వెళదాం.
నేను 21 సంవత్సరాల వయసు నుంచే రన్నింగ్‌తో ప్రారంభించాను. కంటోన్మెంట్ ఏరియాలో పెరిగాను కదా. అక్కడ మిలటరీ స్టైల్ ట్రైనింగ్‌తో పరిచయం ఉంది. చాలా స్పోర్ట్స్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాను. నాకు వెయిట్స్ లేకుండా ఫ్రీ ఫామ్ ఎక్సర్‌సైజ్‌లు అంటే చాలా ఇష్టం. నా ఉద్దేశంలో ఫిజిక్ అంటే విపరీతమైన కండలు, నరాలు తేలిపోవడం అవన్నీ కాదు... ఛాతీ కన్నా పొట్ట తక్కువగా ఉండాలి. వారంలో ఆరుసార్లు వర్కవుట్స్ చేస్తాను. రెండుసార్లు కిక్‌బాక్సింగ్, రెండు సార్లు రన్నింగ్, రెండు మూడుసార్లు క్రాస్‌ఫిట్‌కు కేటాయిస్తాను.
ఫుల్‌బాడీ కోర్ ఎక్సర్‌సైజ్ క్రాస్‌ఫిట్. దీనిలో రోప్స్, జిమ్నాస్టిక్ రింగ్, జేబీసీ టైర్స్, రాడ్స్ ఇలాంటివన్నీ వర్కవుట్ ఎక్విప్‌మెంట్లే. రెగ్యులర్ వెయిట్స్, డంబెల్స్‌కు పరిమితం కాకుండా రకరకాల పరికరాలను యూజ్ చేయడానికి అవకాశమిచ్చే వర్కవుట్ ఇది. బెసైప్స్, ట్రైసెప్స్ ఇలా ఏవో కొన్ని మజిల్స్‌కే పరిమితం చేయకుండా అంతర్గతంగా దేహాన్ని శక్తిమంతం చేస్తుంది. దీనిలో కిక్స్, క్లాపింగ్ పుషప్స్, హ్యాండ్‌స్టాండ్, స్టెబిలిటీ పుషప్ వంటివి ఉంటాయి. చాలా మంది అప్పర్‌బాడీకి మాత్రమే తమ వ్యాయామాలను ఫోకస్ చేస్తారు. కాని లెగ్స్ అంతకన్నా ముఖ్యం. దేహాన్ని మొత్తం నిలబెట్టేవి అవే. దీనికి, మిగిలిన వర్కవుట్స్‌కి వ్యత్యాసం ఏమిటంటే... బాడీలోని పార్ట్స్ అన్నింటికీ, పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌కు ఇది ఉపకరిస్తుంది. కేవలం బాడీ షేప్, మజిల్ టోనప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా నిత్య జీవితంలోనూ వేర్వేరు సందర్భాలను తట్టుకోవడానికీ పనికివస్తుంది. అయితే ఈ వర్కవుట్ కాస్త శరీర దారుఢ్యం ఉన్నవారే చేయగలరు.
- సాక్షి, సిటీ ప్లస్