వివాహితపై స్నాచర్స్ దాడి | chain snacher attack on a women | Sakshi
Sakshi News home page

వివాహితపై స్నాచర్స్ దాడి

Jan 1 2016 11:02 PM | Updated on Sep 3 2017 2:55 PM

నగరంలోని చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఆగంతకులు ఓ మహిళ మెడలో పుస్తెల తాడును తెంపుకుపోయారు.

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): నగరంలోని చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఆగంతకులు ఓ మహిళ మెడలో పుస్తెల తాడును తెంపుకుపోయారు. శుక్రవారం రాత్రి జంగంమెట్ యాదగిరి కాలనీలో అనసూయ (50) అనే మహిళ ఇంటి ముందు నడుస్తున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఆగారు.

ఒకడు కిందకు దిగి ఆమె మెడలోని ఐదున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని వచ్చిన బైక్‌పై పరారయ్యారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, ఆగంతుకుల ముఖాలు స్పష్టంగా కనిపించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement