ఏపీ గ్రూప్-1 పరీక్షా కేంద్రాల మార్పు | AP Group -1 Exam Centres are Changed | Sakshi
Sakshi News home page

ఏపీ గ్రూప్-1 పరీక్షా కేంద్రాల మార్పు

Sep 20 2016 1:12 AM | Updated on Sep 4 2017 2:08 PM

అభ్యర్థుల సౌకర్యార్థం ప్రస్తుతం జరుగుతున్న 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: అభ్యర్థుల సౌకర్యార్థం ప్రస్తుతం జరుగుతున్న 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోని అశోకా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(కోడ్-80102), రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్(80103), నాదర్‌గుల్‌లోని ఏఎల్‌ఆర్‌ఆర్ జూనియర్ కాలేజీ(80109), ఇబ్రహీంపట్నంలోని ఎంఆర్‌ఎం గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్(80110)లలో ఇప్పటివరకు పరీక్ష రాసిన అభ్యర్థులు.. ఇకనుంచి సాగర్‌రోడ్డులో ఇబ్రహీంపట్నం మండలం శేరిగుడ సమీపంలోని చింతపల్లిగుడ వద్ద ఉన్న అరబిందో కాలేజీ ఆఫ్ మేనేజ్‌మెంట్(80106)లో తదుపరి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

అలాగే పటాన్‌చెరువులోని ఆర్‌ఆర్‌ఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(80104)లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు అదే మండలం(పటాన్‌చెరువు)లోని ఇంద్రశాం దగ్గర ఉన్న ఆర్టీవో ఆఫీసు సమీపంలోని టర్బోమెషినరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్(80101)లో తదుపరి పరీక్షలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నెల 21, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షలను కొత్తగా ఎంపిక చేసిన కేంద్రాల్లోనే రాయాలని ఆయా అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రానికి ఉదయం 8:30 నుంచి 9 గంటలలోపు హాజరుకావాలని, ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement