ఎంసెట్-2014 నిర్వహణకు వీలుగా హైదరాబాద్ నగరాన్ని 8 జోన్లుగా విభజించినట్లు ఎంసెట్ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి మే 17న ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు, మెట్రోరైల్ పనులు, గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో.. పరీక్షకు హాజరు కానున్న విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసెట్ అధికారులు తెలిపారు. గతంలో గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాలను నాలుగు జోన్లుగా విభజించగా, తాజాగా 8 జోన్లుగా విభజించారు. ఏ జోన్ల పరిధిలో నివసించే అభ్యర్థులకు ఆ జోన్లలోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు.