860 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి | 860 Post offices Currency exchange | Sakshi
Sakshi News home page

860 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి

Nov 11 2016 3:14 AM | Updated on Sep 4 2017 7:44 PM

రాష్ట్రంలోని ప్రధాన పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. గురువారం బ్యాంకుల

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. గురువారం బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీ చేరుకోవడంతో పోస్టాఫీసుల్లో మధ్యాహ్నం నుంచి మార్పిడికి అవకాశం కల్పించారు. హైదరాబాద్ జీపీవోతో పాటు ప్రధాన పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కోసం ప్రత్యేకంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. కొత్త కరెన్సీ అలస్యంగా రావడం, రూ.2,000 నోట్లను మాత్రమే జారీ చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
 
  రాష్ట్రంలోని సుమారు 860 పోస్టాఫీసుల్లో ఈ నెల 24 వరకు వరకు కరెన్సీ మార్పిడికి అవకాశం కల్పించినట్లు రాష్ట్ర తపాలా సేవల సంచాలకులు వెన్నం ఉపేందర్ తెలిపారు. మొత్తంమీద 35 హెడ్ పోస్టాఫీసులు, 825 సబ్ పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ మార్పిడికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోస్టాఫీసుల్లో వినియోగదారులు నిర్ణీత నమూనా దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌‌స, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాన్‌కార్డు, ప్రభుత్వరంగ సంస్థళు జారీ చేసిన ఐడీ కార్డుల్లో ఏదైనా ఒకదాని జిరాక్స్ జతచేసి, రోజుకు రూ.4 వేల వరకు పాత నోట్లు అందజేసి కొత్త కరెన్సీ డ్రా చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 5,832 పోస్టాఫీసుల్లో డిసెంబర్ 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement