ఉద్యాన వర్సిటీలో 72 పోస్టుల భర్తీకి అనుమతి | 72 posts approved in Horticulture University | Sakshi
Sakshi News home page

ఉద్యాన వర్సిటీలో 72 పోస్టుల భర్తీకి అనుమతి

Jun 19 2016 12:45 AM | Updated on Oct 2 2018 4:36 PM

ఉద్యాన వర్సిటీలో 72 పోస్టుల భర్తీకి అనుమతి - Sakshi

ఉద్యాన వర్సిటీలో 72 పోస్టుల భర్తీకి అనుమతి

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీలో 72 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్థిక శాఖ ఉత్తర్వులు.. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ
 
 సాక్షి, హైదరాబాద్: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీలో 72 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేసేందుకు అంగీకరించింది. ప్రొఫెసర్/ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టు ఒకటి, అసోసియేట్ ప్రొఫెసర్/సీనియర్ సైంటిస్ట్ పోస్టులు 19, అసిస్టెంట్ ప్రొఫెసర్/సైంటిస్ట్ పోస్టులు 28, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి.

స్టోర్ కీపర్ పోస్టులు 5, కేర్ టేకర్ పోస్టులు 4, వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులు 13 ఉన్నాయి. పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆర్థిక శాఖ ఆదేశించింది. జోన్లు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లలను సక్రమంగా పాటించాలని పేర్కొంది. భర్తీకి  నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement