నేరస్తుల ఏరివేతలో భాగంగా నలుగురు పేరుమోసిన దొంగలను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నలుగురు నేరస్తుల అరెస్ట్
Nov 12 2016 4:26 PM | Updated on Aug 21 2018 5:51 PM
హైదరాబాద్: నేరస్తుల ఏరివేతలో భాగంగా నలుగురు పేరుమోసిన దొంగలను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు 22 దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనాల డిక్కీల్లో నుంచి నగదు తస్కరించడం, బ్యాంకులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చిన వారి దృష్టి మరల్చి డబ్బు అపహరించడంలో నేర్పరులైన వీరిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. కర్మన్‌ఘాట్ భూపేష్‌గుప్తా నగర్‌లో నిందితులు ఉంటున్న ఇంటినుంచి రూ. 17.88 లక్షల నగదు, పది తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎక్కువగా రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పేట్ల సురేష్, కుంచాల గోపి, పసుపులేటి శివ, గోకుల్‌దాస్ అనే నలుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Advertisement