మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం
స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది.
సికింద్రాబాద్ : స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగిన తరుణంలో గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు రోగులకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగు రోజుల క్రితం అంబర్‌పేట గోల్నాక ప్రాంతానికి చెందిన మహిళ (50) గాంధీకి రాగా ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు.
బుధవారం సన్‌షైన్ ఆస్పత్రి నుంచి మూడేళ్ల బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రాగా పరీక్షల్లో వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో గాంధీలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. సాధారణంగా చలి ఎక్కువగా ఉన్న సమయంలో విజృంభించే వ్యాధి కారక వైరస్ చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో వెలుగులోకి రావడంతో రూపాంతరం చెందిందేమోనని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.