షిర్డి హారతి వేళలు యథాతథం | Shirdi: Now, pay extra for VIP 'aartis' at Sai Baba temple | Sakshi
Sakshi News home page

షిర్డి హారతి వేళలు యథాతథం

Aug 2 2015 2:14 AM | Updated on Sep 3 2017 6:35 AM

షిర్డి హారతి వేళలు యథాతథం

షిర్డి హారతి వేళలు యథాతథం

స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో హారతి సేవల సమయాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్‌ఎస్‌ఎస్‌టీ) శనివారం ప్రకటించింది.

షిర్డి: స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో హారతి సేవల సమయాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్‌ఎస్‌ఎస్‌టీ) శనివారం ప్రకటించింది. నాసిక్-త్రయంబకేశ్వర్ కుంభమేళా నేపథ్యంలో ఆలయానికి లక్షలాదిగా భక్తులు రాక పెరగడంతో హారతి వేళలను మార్చాలని నిర్ణయించారు. మామూలుగా ఆలయంలో ఉదయం గం.4.30కి కాకడ్ హారతి, రాత్రి గం.10.30కి శేజరతి హారతి కార్యక్రమాలు ఉంటాయి. వీటిని ఉదయం గం.3.00లకు, రాత్రి గం.11.30కి నిర్వహించాలని ఎస్‌ఎస్‌ఎస్‌టీ కార్యనిర్వహక అధికారి రాజేంద్ర జాదవ్ శనివారం ఉదయం ప్రకటించారు.

విషయం తెలిసిన భక్తులు, స్థానికులు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టి తమ నిరసన వ్యక్తంచేశారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఆలయ త్రిసభ్య కమిటీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement