కొవ్వూరు గౌతమిఘాట్‌లో తుపాకీ కలకలం


కొవ్వూరు : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గౌతమి మహర్షి పుష్కరఘాట్‌లో గురువారం తుపాకీ కలకలం సృష్టించింది. గురవారం పుష్కరఘాట్‌లో పని చేసే కార్మికులు ఓ వ్యక్తి వద్ద తుపాకీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని, అతనిని  అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, సీఎం చంద్రబాబు నేడు జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా తుపాకీ బయటపడటం కలకలం రేపుతోంది.

 


Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top