పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తు గడవును పొడిగించారు.
విజయవాడ: పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తు గడవును పొడిగించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబరు 7వ తేదీ వరకూ నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామ్స్ గవర్నింగ్ బాడీ కౌన్సిల్ సభ్యులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు.
అదే విధంగా 2010 ఎంబీబీఎస్ బ్యాచ్‌కు ఇంటర్నెషిప్ పూర్తి చేసే గడువును ఏప్రిల్ 15 వరకూ పొడిగించినట్లు వీసీ తెలిపారు. ఇప్పటికే 2010 ఎంబీబీఎస్ బ్యాచ్ అభ్యర్ధులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో వెబ్‌సైట్ ను ప్రారంభించనున్నట్లు వీసీ పేర్కొన్నారు.