గంగోత్రి ఆలయం మూసివేత | gangotri temple closed due to winter | Sakshi
Sakshi News home page

గంగోత్రి ఆలయం మూసివేత

Nov 13 2015 9:19 AM | Updated on Sep 3 2017 12:26 PM

శీతాకాలం ప్రారంభమవుతుండడంతో ఉత్తరఖాండ్ రాష్ర్టంలోని హిమాలయ పుణ్యక్షేత్రం గంగోత్రిని గురువారం మూసివేశారు.

డెహ్రడూన్: శీతాకాలం ప్రారంభమవుతుండడంతో ఉత్తరఖాండ్ రాష్ర్టంలోని హిమాలయ పుణ్యక్షేత్రం గంగోత్రిని గురువారం మూసివేశారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయానికి మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఆలయ పూజారులు, అధికారుల సమక్షంలో తాళం వేశారు.  ఉత్తరాఖండ్‌లోని నాలుగు హిమాలయ పుణ్యక్షేత్రాల్లో(బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి) ఇది ఒకటి. వీటిని చార్‌ధామ్ అని పిలుస్తారు. కాగా మిగతా మూడు దేవాలయాలను త్వరలోనే మూసివేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement