బాబు దిష్టిబొమ్మ దహనం | Chandrababu Naidu effigy burning | Sakshi
Sakshi News home page

బాబు దిష్టిబొమ్మ దహనం

Feb 11 2016 11:28 AM | Updated on Aug 24 2018 2:36 PM

పిడుగురాళ్ల మండలం బుచ్చిగొండ గ్రామం వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ నాయకులు దహనం చేశారు.

పిడుగురాళ్ల మండలం బుచ్చిగొండ గ్రామం వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ నాయకులు దహనం చేశారు. దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాచర్ల-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో సుమారు 4 కి.మీ ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అటుగా వస్తున్న నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఈ విషయం గురించి వినతిపత్రం అందజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement