కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కు పత్యేక హోదా, పోలవరానికి నిధులు సాధిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
పోలవరం (పశ్చిమ గోదావరి) : కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కు పత్యేక హోదా, పోలవరానికి నిధులు సాధిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మట్టిసత్యాగ్రహంలో భాగంగా మంగళవారం పోలవరం వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై గర్జించిన బీజేపీ అధికారంలోకి రాగానే మాటమార్చి ఆంధ్రులను మోసం చేసిందన్నారు.
ఉద్యమాలు చేసైనా సరే ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు సాధిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం మట్టిని సేకరించారు. సేకరించిన మట్టిన ప్రధాన మంత్రికి పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. రఘువీరా వెంట మాజీ ఎంపీ జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.