గుజరాత్‌ మోడల్‌ మిథ్యేనా!

Gurath model review by sudheer - Sakshi

ఇలాంటి ఆరోపణలు నాయకుల నోటివెంట వింటుంటే వింతనిపిస్తుంది. పాకిస్తాన్‌ జాతీయులతో కలసి భోజనం చేయడమే నేరమైతే, నరేంద్ర మోదీ కూడా అలాంటి నేరం చేసిన వారే అవుతారు. 2015 డిసెంబర్‌లో నాటి పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికి హఠాత్తుగా లాహోర్‌లో మోదీ దిగిపోయారు. ఆయన షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన వారం రోజులకే ఉధంపూర్‌ దాడులు జరిగిన వాస్తవాన్ని ప్రధాని కావాలని విస్మరించారు.

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్‌ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు డిసెంబర్‌ 14వ తేదీన పోలింగ్‌ జరగబోతోంది. పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలే 18 మాసాలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని దేశంలో చాలామంది భావిస్తున్నారు. గుజరాత్‌లో 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా ఆ పార్టీయే అధికారం చేజిక్కించుకుంటే, 2019 ఎన్నికలలో గెలవడం లాంఛనమే. కానీ కాంగ్రెస్‌ పార్టీ కనుక బీజేపీ కలలను భగ్నం చేయగలిగితే, రెండో పర్యాయం మోదీ ప్రధాని కావడం నల్లేరు మీద నడక కాబోదు.

సొంత రాష్ట్రం గుజరాత్‌లో నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించిన తీరు మీద ప్రజలలో సర్వత్రా ఆసక్తి నెలకొనడానికి కారణం కూడా ఇదే. నా వరకు, మోదీ అనుసరించిన ఎన్నికల పోరాట వ్యూహాన్ని చూసి చాలా నిరుత్సాహపడ్డాను. 2014 ఎన్నికల సమయంలో గాంధీనగర్‌లో మోదీ తనను తాను ఆ అత్యున్నత పదవికి తగినవానిగా చెప్పుకున్న రికార్డు ఉంది. తరువాత ఆయన ఎంతో తెలివిగా గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటా ప్రచారం చేసుకోగలిగారు. ఆ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉందని మిగిలిన రాష్ట్రాలు నమ్మే విధంగా చేశారు. కాబట్టి ఈ 2017 శాసనసభ ఎన్నికలు ఇంతవరకు జరిగిన గుజరాత్‌ అభివృద్ధి నమూనాలోని సామర్థ్యం మీద వెలువడే తీర్పుగా భావిం చాలి. ఆ నమూనా సమర్థమైనదే అయితే ఆ రాష్ట్రంలో మరోసారి ప్రజలు మరో ఐదేళ్ల పాటు పాలించేందుకు బీజేపీకే అధికారం అప్పగిస్తారు. చిత్రం ఏమిటంటే, మోదీ ప్రవచించే ‘వికాస్‌’అన్న నినాదం ఈ ఎన్నికల ప్రచారంలో కేవలం అధోజ్ఞాపిక స్థాయికి దిగజారిపోయింది. మోదీ ఫొటోతో ముద్రించిన పోస్టర్ల మీద ‘నేనే వికాస్‌’, ‘నేనే గుజరాత్‌’ అంటూ కనిపించిన అక్షరాలలో మాత్రమే ‘వికాస్‌’ దర్శనమిస్తున్నది.

గుజరాత్‌ మోడల్‌ మాటేమిటి?
ఇంకో వింత కూడా ఉంది. ప్రతిభను చెప్పే రిపోర్ట్‌ కార్డు కనుక బాగుంటే, మోదీ, అమిత్‌షా, విజయ్‌ రూపాణీ పటాటోపంగా గుజరాత్‌ మోడల్‌ను అందరికీ ప్రదర్శించేవారే. అంతేకానీ తల్లిదండ్రులకు కూడా రిపోర్టు కార్డును చూపించడానికి సిగ్గుపడే విద్యార్థిలా ప్రవర్తించేవారు కాదు. నిరుద్యోగం గురించి, నీటి సమస్య గురించి, వస్తుసేవల పన్ను, పెద్ద నోట్ల రద్దు ఫలితంగా చిన్న చిన్న వ్యాపారులు పడుతున్న ఇక్కట్లు వంటి వాటి గురించి రాహుల్‌ గాంధీ, హార్దిక్‌ పటేల్‌ ప్రశ్నిస్తుంటే, మోదీ వేరే అంశాలను ప్రస్తావించడానికి నిర్ణయించుకున్నారు. హిందూ ముస్లిం ఓట్ల మధ్య విభజన తేవడమే బీజేపీ వ్యూహం.
నిజానికి ప్రధాని తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ ఇంత నిరాశతో ప్రయోగిస్తున్న తీరును ఇంతవరకు జరిగిన ఏ రాష్ట్ర ఎన్నికలలోనూ చూడలేదు.

లవ్‌ జీహాద్‌ పేరుతో ఒక వ్యక్తిని ఒక హిందువు గొడ్డలితో నరికి చంపిన దృశ్యంతో కూడిన ఘోరమైన వీడియో టీవీ చానళ్లలో వచ్చింది. కానీ ప్రధాని మాత్రం ఈ దారుణం గురించి ప్రస్తావించకుండా, అదే రోజున నీచ జాతికి చెందిన వాడంటూ తన మీద మణిశంకర్‌ అయ్యర్‌ నోరు జారడం గురించే ఎక్కువగా ప్రస్తావించారు. అయ్యర్‌ మాట్లాడిన హిందీ భాషలో కులం గురిం చిన ప్రస్తావన స్పష్టంగా లేకపోయినా, తన ఓబీసీ వర్గ పరిధితో దానిని ముడిపెట్టారు మోదీ. అంతేకాకుండా గుజరాత్‌ గడ్డ మీద పుట్టిన వ్యక్తిని అవమానించడమేనని చెప్పడానికి ప్రయత్నం చేశారు. తరువాత నవంబర్‌లో ఒక పాకిస్తానీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా రంగం మీదకు తెచ్చి, కాంగ్రెస్‌ నాయకుడు (అయ్యర్‌) తనను అంతం చేయడానికి పాకిస్తాన్‌లో ఎవరికో సుపారీ ఇచ్చారని తీవ్ర ఆరోపణలకు దిగారు. అయ్యర్‌ చెబుతున్న భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలకు మోదీ ఇచ్చిన భాష్యమిది. అయితే అయ్యర్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పిందేమిటి? ‘మొట్టమొదటిగా చేయవలసిన పనేమిటంటే, నరేంద్ర మోదీని తొలగించడం. అప్పుడే చర్చల ప్రక్రియ ముందుకు వెళుతుంది. అందుకు మనం నాలుగేళ్లు వేచి ఉండవలసి ఉంటుంది?’అని. అంటే ప్రజాస్వామిక ప్రక్రియ ప్రకారం భారత్‌ తన నేతను ఎంచుకోవడానికి 2019 ఎన్నికల తరువాతనే అవకాశం చిక్కుతుందని అయ్యర్‌ వాదన.

విందు రాజకీయం
మరో కుట్ర సిద్ధాంతం గురించి మోదీ వెల్లడించారు. పాకిస్తాన్‌ ప్రతినిధులకు అయ్యర్‌ విందు ఇచ్చారని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ కూడా అందులో పాల్గొన్నారని మోదీ చెప్పారు. ఒక పక్క గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్‌ నేతలు పాకిస్తాన్‌ ప్రతినిధులతో చర్చలు జరపవలసిన అవసరం ఏమిటి? అంటూ మోదీ పల్లవి అందుకోగానే, మిగిలిన పార్టీ నాయకులంతా అదే పాట అందుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ విందులో పాల్గొన్న మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ట్రపతి, సైనికదళాల మాజీ అధికారి, పదవీ విరమణ చేసిన దౌత్యాధికారులు తన మీద కుట్ర చేశారన్నదే మోదీ ఆరోపణ. ఒకవేళ మోదీ దగ్గర ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే, ఆయన ప్రస్తావించిన వ్యక్తుల మీద దర్యాప్తు కోసం తన అధీనంలోనే ఉండే నిఘా అధికారులను ఆదేశించవచ్చు. ఇలాంటి ఆరోపణ చేసినందుకు క్షమాపణలు చెప్పాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కోరారు. అయితే మోదీ నుంచి అలాంటి క్షమాపణ వినే అవకాశాలు బాగా తక్కువ.

ఇలాంటి ఆరోపణలు వింటుంటే వింతనిపిస్తుంది. పాకిస్తాన్‌ జాతీయులతో కలసి భోజనం చేయడమే నేరమైతే, మోదీ కూడా అలాంటి నేరం చేసిన వారే అవుతారు. 2015 డిసెంబర్‌లో నాటి పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికి హఠాత్తుగా లాహోర్‌లో మోదీ దిగిపోయారు. ఆయన షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన వారం రోజులకే ఉధంపూర్‌ దాడులు జరిగిన వాస్తవాన్ని ప్రధాని కావాలని విస్మరించారు. అంటే ఆయన హఠాత్తుగా పాక్‌లో దిగిన తరువాతే కశ్మీర్‌లో పరిస్థితులు మరింత క్షీణించాయి. పఠాక్‌కోట్‌ వైమానిక కేంద్రం మీద దాడి కూడా అప్పుడే జరిగింది. ఇలా ఉండగా, గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో రేగిన వివాదం పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసిన అంశంతో మరింత దిగజారింది.‘భారత్‌ ఈ ఎన్నికల వివాదంలోకి పాకిస్తాన్‌ను లాగడం ఆపాలి. బాధ్యతా రాహిత్యంతో, ఆధారాలు లేని ఇలాంటి కల్పిత కుట్రల ఆరోపణలు గుప్పించే కంటే తన సొంత బలంతో ఎన్నికలలో నెగ్గడానికి ప్రయత్నించాలి’అన్నదే ఆ ట్వీట్‌ సారాంశం.

రామ్‌–హజ్‌
ఈ వివాదంలోకి అహ్మద్‌పటేల్‌ను లాగడానికి కూడా శతవిధాలా ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ పోస్టర్లు వెలిశాయి. ఇలాంటి పోస్టర్లతో ఏం సాధించదలుచుకున్నారో సుస్పష్టం. గుజరాత్‌ హిందూ– ముస్లిం ఓటర్ల మధ్య విభజన తీసుకురావడమే దాని వెనుక ఉద్దేశం. కానీ ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా కేవలం 9 శాతం. గుజరాతీయులకు పాఠం చెప్పేం దుకే అహ్మద్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్న ఒక టేప్‌ను కూడా బీజేపీ అధికార ప్రతినిధి రంగం మీదకు తెచ్చారు. ఇది బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. అయోధ్యలో మందిరం నిర్మించాలని కోరుకుంటున్నారా, లేకుంటే మసీదు నిర్మించాలని కోరుకుంటున్నారా! స్పష్టం చేయవలసిందంటూ కాంగ్రెస్‌ నాయకులకు ప్రధాని సవాలు విసిరారు. ఈ అంశానికీ, గుజరాత్‌ ఎన్నికలకూ సంబంధం ఏమిటో ఎవరికీ అర్థం కాక, ఆశ్చర్యంలో ముంచెత్తింది.

మోదీ నాయకత్వంలో జరుగుతున్న గుజరాత్‌ ఎన్నికల ప్రచారం ఏం చెబుతుంది? ఇది భయాందోళనలను సూచిస్తున్నదా? విభజనతోనే ఓట్లు వస్తాయన్న ఆలోచనా? బీజేపీ త్రయంతోను, కాంగ్రెస్, దాని కొత్త మిత్రుల పేర్లతోను దర్శనమిచ్చిన పోస్టర్లు మరొక అంశం. వీటి ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారో స్పష్టమే. బీజేపీ త్రయంలోని పేర్లు రూపాణీ (ఆర్‌), అమిత్‌ షా (ఏ), మోదీ (ఎం)– ఈ మూడు పొడి అక్షరాలు కలిపితే ‘రామ్‌’ అవుతుంది. అదే హార్దిక్‌ (హెచ్‌), అల్పేష్‌ (ఏ), జిగ్నేశ్‌ (జె) – ఈ మూడు కలిపితే ‘హజ్‌’ అవుతుంది. ఈ అక్షరాలు వేటికి సంకేతాలో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇంతకు ముందు కూడా ఇలా బీజేపీ పేర్లతో లబ్ధి పొందిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. జేమ్స్‌ మైఖేల్‌ లింగ్ధో పేరు వల్ల 2002లో, మియాన్‌ ముషార్రఫ్‌ పేరు వల్ల 2007లోను బీజేపీ తన అధికారాన్ని నిలుపుకుంది. ఈ ఎన్నికలలో కూడా లబ్ధి పొందవచ్చునని ఆ పార్టీ మరోసారి ఈ ఆయుధం వైపు మొగ్గి ఉండవచ్చు.

ముస్లింలను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌
గుజరాత్‌లో తొమ్మిది శాతంగా ఉన్న ముస్లింలను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్‌ కూడా దోషిగానే నిలుస్తుంది. గతానుభవాలను బట్టే ఇలా చేసినట్టు ఆ పార్టీ వ్యూహకర్తలు చెబుతున్నారు. ముస్లింల ప్రయోజనాల గురించి కాంగ్రెస్‌ మాట్లాడితే, బీజేపీ వెంటనే తమ పార్టీని ముస్లిం అనుకూల పార్టీగా ముద్రవేసి, హిందూ ఓట్లను గంపగుత్తగా పట్టుకుపోతుందని కూడా ఆ పార్టీ భావిస్తున్నది. అంటే, ముస్లింలు తమకే ఓటు వేయక తప్పదని ఆ పార్టీ విశ్వా సంగా కనిపిస్తుంది. కాబట్టి వారిని ఓట్లు కోరవలసిన అవసరం లేదని భావి స్తున్నది కూడా. అయితే మోదీ మాత్రం ముస్లిం మహిళలు బీజేపీకి ఓటు వేస్తారన్న ఆశతో తలాక్‌ అంశాన్ని ప్రస్తావించారు.

చాలావరకు ఓపీనియన్‌ పోల్స్‌ అంచనా వేసినట్టు గుజరాత్‌ ఎన్నికలలో బీజేపీ కనుక విజయం సాధిస్తే, 2018లో కొన్ని ఇతర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో కూడా ఇదే అబద్ధాల, అర్థ సత్యాల కర్మాగారాన్ని ఉపయోగించుకుంటుందని నా అనుమానం. అదే వ్యూహాన్ని 2019 సాధారణ ఎన్నికలలో కూడా అనుసరించవచ్చు. 2014 ఎన్నికలలో అచ్చేదిన్‌ తీసుకువస్తామంటూ హామీ ఇచ్చిన వ్యక్తిని ప్రజలు విశ్వసించారు. అభివృద్ధి అనే పునాది మీద పాలన సాగిస్తాడని నమ్మిన ఆ వ్యక్తి గుజరాత్‌ మోడల్‌ ద్వారా నిరాశపరి చారు. అయితే ఇక ఎవరైనా ఏమైనా ఆశించేది ఏం ఉంటుంది? అలాంటి నిరాశ గుజరాత్‌కే పరిమితం కావాలి.

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
టీఎస్‌ సుధీర్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top