వారఫలాలు

Varafalalu in this week - Sakshi

21 అక్టోబర్‌ నుంచి 27 అక్టోబర్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్తగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు తథ్యం. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. వారం మధ్యలో  భూ వివాదాలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి  సకాలంలో పూర్తి చేస్తారు. పట్టుదల, నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంటుంది. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. మిత్రులు, బంధువుల నుంచి ఆహ్వానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహం.  ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. రావలసిన పైకం సకాలంలో అందుతుంది.  ఆరోగ్యసమస్యలు తీరతాయి. ఆస్తులు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మాటల నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి..

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. విద్యార్థుల ప్రజ్ఞాపాటవాలకు తగిన గుర్తింపు రాగలదు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి అరుదైన సన్మానాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి..

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలకు లోటురాదు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. తీర్థయాత్రలు జరుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి..

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. రుణభారాలు తొలగి, సంతోషంగా ఉంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం చాలావరకు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం చివరిలో  ధననష్టం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు వివాదాల పరిష్కారం. నూతన వ్యక్తుల పరిచయం. విద్యార్థులు కొత్త లక్ష్యాలతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది, అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.  కళారంగం వారికి కొత్త అవకాశాలు.  వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకుపచ్చ, లేతపసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి..

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల చేయూత అందుతుంది.  శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చేజారిన  కాంట్రాక్టులు తిరిగి దక్కుతాయి. కుటుంబసమస్యలు ఎవరినీ నొప్పించకుండా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ప్రగతి ఉంటుంది, పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు, సమస్యలు తీరతాయి. కుటుంబసభ్యులతో కీలక విషయాలపై చర్చిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు సైతం తీసుకుంటారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. వారం మధ్యలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనుల్లో ఆటంకాలు. భూసంబంధిత వివాదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. మిత్రులు కూడా  శత్రువులుగా మారతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిళ్లు.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి.వారం మధ్యలో శుభవార్తలు, వాహనయోగం. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. శక్తియుక్తులతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులు అనూహ్యమైన అవకాశాలు దక్కించుకుంటారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు.  వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో కలహాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా కొంత బలపడతారు. ఆలోచనలు అమలులో కుటుంబసభ్యులు సలహాలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో అవగాహనకు వస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. వ్యాపారాలు విస్తృతమవుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. 
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో( 21 అక్టోబర్‌ నుంచి 27 అక్టోబర్‌ 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఆర్థిక వ్యవహారాల్లో అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ఇదివరకటి నష్టాలను పూడ్చుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇంటికి కొత్త అలంకరణలు చేపడతారు. సన్నిహితులతో విందు వినోదాలతో సందడిగా గడుపుతారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. విదేశయాన ప్రయత్నాలు సఫలమవుతాయి. కలలు నెరవేరుతాయి.
లక్కీ కలర్‌: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అవకాశాలు అందుబాటులోనే ఉన్నా, వాటిని అందుకోవడానికి తటపటాయిస్తారు. ఊగిసలాట నుంచి బయటపడితేనే ముందుకు సాగగలుగుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని అమితంగా ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. మిత్రులతో కలసి విహారయాత్రలను ఆస్వాదిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
సమస్యలు పరిష్కారమవుతాయి. వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. మీ నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుని, అందుకు తగిన రీతిలో పెట్టుబడులు పెడతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మితిమీరిన పని ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో సవాళ్లను స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కొత్త దశ మొదలవుతోంది. అద్భుతమైన భవితవ్యానికి నాంది పలికే మార్పులు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఇదివరకటి కృషికి తగిన ఫలితాలు ఇప్పుడిప్పుడే చేతికందడం మొదలవుతుంది. అంతరాత్మ ప్రబోధం మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీదైన ముద్ర వేస్తారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పుంజుకుంటాయి. మనసుకు చేరువైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కుటుంబ సభ్యులతోను, మిత్రులతోను సరదాగా గడుపుతారు. లాభసాటి వ్యాపారాల్లో భాగస్వాములుగా చేరుతారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కొత్త ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అభిరుచికి తగినట్లుగా ఇంట్లో అలంకరణలు చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటారు. జాప్యాన్ని సహించలేక సహనాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం మంచిది. పరిస్థితులు వాటంతట అవే చక్కబడతాయి. నిదానంగా నిలకడగా పనులు కొనసాగిస్తూ లక్ష్యాలను చేరుకుంటారు. ఇతరుల నుంచి సహకారం పొందుతారు. సకాలంలో అవసరాలకు తగిన ఆర్థిక సహాయం పొందుతారు.
లక్కీ కలర్‌: నీలం

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఇంటా బయటా ఊహించని మార్పులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. జీవితాన్ని మీ అభీష్టానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు. కొత్తగా తెలుసుకున్న సమాచారాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక పురోభివృద్ధికి తగిన అవకాశాలను స్వయంగా సృష్టించుకుంటారు. భావసారూప్యత గల మిత్రుల సహకారంతో వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. సృజనాత్మక రంగంలోని వారు అద్భుతంగా రాణిస్తారు. కళాకారులు సత్కారాలను పొందుతారు. విదేశీయాన సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఇతరుల్లో స్ఫూర్తి కలిగిస్తారు. వివేకవంతమైన ఆలోచనలతో మీ బృందానికి నాయకత్వం వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ప్రేమానుబంధాలకు సంబంధించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయ పోరాటంలో గెలుపు సాధిస్తారు. చిరకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. పాత బకాయిలను తీర్చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునే ఉద్దేశంతో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
లక్కీ కలర్‌: ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
సవాళ్లతో కూడుకున్న అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పరిస్థితులకు ఎదురొడ్డి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. అత్యుత్సాహాన్ని, తొందరపాటుతనాన్ని అదుపు చేసుకోవడం మంచిది. మీకు వ్యతిరేకంగా వదంతులు వ్యాపించే సూచనలు ఉన్నాయి. వాటిపై అతిగా స్పందించకుండా సంయమనం పాటించడమే క్షేమం. వివాదాస్పద వ్యక్తుల వల్ల చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: గోధుమరంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి. అకాల భోజనం తప్పకోవచ్చు. అలసట చెందుతారు. శక్తులన్నీ కోల్పోయినట్లుగా భావిస్తారు. మానసికంగా అలజడికి లోనవుతారు. ఏకాంతాన్నీ ప్రశాంతతనూ కోరుకుంటారు. ధ్యానమార్గంలో సాంత్వన పొందుతారు. కొత్త ఉద్యోగావకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఆశించిన అభివృద్ధి ఇంకా సాధించలేదనే అసంతృప్తి వెంటాడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంటుంది. విహార యాత్రలతో కొంత ఉత్తేజం పొందుతారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అతిగా తాపత్రయపడతారు. భావి ప్రణాళికలతో నిరంతరం సతమతమవుతూ వర్తమానంలో తారసపడే ఆనందాలను కోల్పోతారు. వృత్తి ఉద్యోగాల్లో అవసరానికి మించి శ్రమిస్తారు. అనుకోని అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనిని ఇతరులతో పంచుకుంటేనే మీకు తీరిక చిక్కుతుంది. అన్ని పనులూ స్వయంగా చేయాలనే చాదస్తాన్ని వదులుకుంటేనే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒంటరిగా ఉంటున్నవారు తగిన జంట కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.
లక్కీ కలర్‌: పసుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఇదివరకటి పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. ప్రేమానుబంధాన్ని ఆస్వాదిస్తారు. ప్రియతములతో విహారయాత్రలకు వెళతారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటడం ద్వారా ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. జనాకర్షణ పెరుగుతుంది. సన్నిహితులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ప్రముఖు సహాయంతో గడ్డు సమస్యల నుంచి తేలికగా బయటపడతారు.
లక్కీ కలర్‌: నారింజ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరి వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత వహించాల్సి వస్తుంది. చేటు చేసే పాత అలవాట్లను మానుకుని కొత్తగా మంచి అలవాట్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కళాకారులకు ఉన్నత సత్కారాలు లభిస్తాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి
ఇన్సియా ,టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top