టారో : 17 సెప్టెంబర్‌ నుంచి 23 సెప్టెంబర్‌ 2017 వరకు

టారో : 17 సెప్టెంబర్‌ నుంచి 23 సెప్టెంబర్‌ 2017 వరకు


మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

వృత్తిరీత్యా పదోన్నతి పొందుతారు. ఏదీ కష్టపడకుండా పొందలేరని గ్రహించి పనిచేయండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, పనిలో మీదైన గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతర శ్రమ అవసరం. కొద్దికాలంగా మిమ్మల్ని కలవరపెడుతోన్న విషయాలన్నీ సద్దుమణిగి అంతా మంచే జరుగుతుంది. ప్రేమ జీవితంలో చిన్న కలవరపాటు. అయితే అది కూడా మంచికే అనుకోండి. కొద్ది రోజులు సంయమనంగా ఉండండి. మీరు అనుకున్నట్లుగా జీవితం సాగిపోతుంది.

కలిసివచ్చే రంగు : ఆకుపచ్చవృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

వృత్తిరీత్యా మీకు అన్నీ మంచి రోజులే! మీ జీవిత ఆశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయమిది. కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల్లో మీరు కలలుగన్న స్థాయిని చేరుకుంటారు. పని, ప్రేమ జీవితం మధ్యన సంయమనం కుదుర్చుకోండి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని ప్రేమ జీవితాన్ని మరింత అందంగా మార్చుకునే ప్రయత్నం చేయండి.

కలిసివచ్చే రంగు : గోధుమమిథునం (మే 21 – జూన్‌ 20)

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. ఎప్పట్నుంచో కోరుకుంటున్న మార్పు దగ్గరలోనే ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడిని పూర్తిగా మీద వేసుకొని కుమిలిపోకండి. కాస్త విశ్రాంతి అవసరమని గ్రహించండి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వండి. త్వరలో విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు.

కలిసివచ్చే రంగు : గులాబికర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

ఆధ్యాత్మిక అంశాల వైపుకు మీ ఆలోచనలు వెళతాయి. అది మీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగవుతుంది. మీపై మీకున్న ఆత్మవిశ్వాసం చెదరకుండా చూస్కోండి. ధైర్యంగా పనిచేస్తూ వెళ్లండి. ప్రేమ విషయంలోనూ మనసు పెట్టి నిర్ణయం తీసుకోండి. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. మీరు కోరుకునే ఆనందం అక్కడే ఉంది.

కలిసివచ్చే రంగు : నారింజసింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

మీ జీవితంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీదైన శైలిలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. చేపట్టే కొత్త పనులన్నీ విజయవంతం అవుతాయి. ప్రేమ జీవితం కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. ప్రశాంతంగా ఉంటూ మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచగలిగే ఆలోచన చేయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మీదైన ఆలోచన విధానం, నడవడిక మీ ఉన్నతికి తోడ్పడేదని ఎప్పుడూ మరచిపోకండి.

కలిసివచ్చే రంగు : తెలుపుకన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోన్న సమస్యలు మరికొద్ది రోజులు కూడా అలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితులకు భయపడి నిరుత్సాహం చెందకండి. చెడు జరిగిపోతుందని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా పరిస్థితులపై పోరాడండి. ఆస్తి సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి.

కలిసివచ్చే రంగు : ఊదాతుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తూ, మీ కష్టాన్నంతా వెచ్చిస్తూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడానికి మరెన్నో రోజులు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఈ వారమో, మరో రెండు వారాల్లోనో శుభవార్త వింటారు. అంతా మంచే జరుగుతుంది. జీవితమంతా కుదురుగా ఓ సరైన చోట ఆగినట్లు అనిపిస్తుంది. అదే మీరు కోరుకున్న సంతృప్తి అని బలంగా నమ్మండి.

కలిసివచ్చే రంగు : ఆకుపచ్చవృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

ఈ వారమంతా మీరు ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. రానున్న రోజులు కూడా ఇంతే ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. జీవితమంటేనే వేడుక అని మీరు నమ్మే సిద్ధాంతాన్నే ఎప్పటికీ మరవకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.

కలిసివచ్చే రంగు : నీలంధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

అనాలోచిత నిర్ణయాలు తీసుకొని తడబడతారు. అయితే అది మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మీ అనుభవానికి తగ్గ పనులు చేస్తూ ఉండండి. మీ ఆలోచనల్లో మీ స్థాయి ఉండడం లేదన్న విషయం గమనించండి. అదే మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన అంశం కూడా! మార్పు కోరుకుంటున్నట్లయితే ఇదే సరైన సమయం. ప్రేమ జీవితంలోనూ కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఈ పరిస్థితులన్నీ మీ ఆలోచనలను విపరీతంగా ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడండి.

కలిసివచ్చే రంగు : గోధుమమకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. మీ ఆలోచన విధానం, ఆత్మవిశ్వాసమే మీకు ఆయుధమన్న విషయాన్ని నమ్మండి. మీ బలమేంటో ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయమిది. కొత్త అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. మీకు ఎంతగానో ఉపకరించే ఆ అవకాశాలను వదులుకోవద్దు. ఏదైనా పని మొదలుపెట్టి మధ్యలోనే వదిలిపెట్టే ఆలోచనలు చేస్తున్నట్లైతే అలాంటివి మానుకోండి.

కలిసివచ్చే రంగు : నారింజకుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)

భవిష్యత్‌పై నమ్మకాన్ని సడలనివ్వకండి. ఇప్పుడు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తోన్న పరిస్థితులన్నీ తాత్కాలికమేనని నమ్మండి. కొద్దికాలంగా ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్యలన్నీ సర్దుకుంటాయి. ప్రేమ జీవితం కాస్త కలవరపరుస్తుంది. ఎక్కువ ఆలోచించి నిరాశ చెందకండి. ఏ కొత్త అవకాశం  మీకోసం ఎదురుచూస్తున్నా, ఇదే సరైన సమయమని నమ్మి ముందుకు వెళ్లండి.

కలిసివచ్చే రంగు : పసుపుమీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

పిల్లలు, ఉద్యోగం, జీవితం మీద అభద్రతా భావం మిమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఇదేమీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారికి కాస్త సమయం కేటాయించాలన్న విషయం మరవకండి. బంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకోండి.

కలిసివచ్చే రంగు : ఎరుపు

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top