వెన్నెముక గాయానికి చికిత్స!

Treatment of spine injury! - Sakshi

వెన్నెముకకు గాయమైతే శరీరం సగభాగం చచ్చుబడిపోవడం మొదలుకొని అనేక సమస్యలు ఎదురవుతాయి. వీటికి ఇప్పటివరకూ సమర్థమైన చికిత్స లేనేలేదు. వెన్నెముక నాడులు తమంతట తాము మరమ్మతులు చేసుకునేలా ప్రేరేపించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించచవచ్చునని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించగా.. ఇటీవలి కాలంలో ఎలుకలు.. కోతుల్లో జరిగిన ప్రయోగాలూ సత్ఫలితాలే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు కొందరు తీవ్రమైన వెన్నెముక గాయాలతో బాధపడుతున్న కోతులను తాము సరిచేయగలిగామని ప్రకటించారు. కోతులకు, మనుషులకు జన్యు సారూప్యత ఎక్కువగా ఉన్నందున ఈ చికిత్స విధానం మానవుల్లోనూ సక్రమంగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.

రొయ్యల్లాంటి జీవుల నుంచి తీసిన ఒక రసాయనాన్ని వెన్నెముక గాయాలున్న కోతులకు అందించినప్పుడు వాటి కేంద్ర నాడీ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు. వెన్నెముకలో ప్రతి సెంటీమీటర్‌కు కొంత చొప్పున ఈ రసాయనాన్ని చేర్చామని... దీని లోపల ఉండే న్యూరోట్రోపిక్‌ మందు ఎన్‌టీ3 ఆ ప్రాంతంలో దీర్ఘకాలం పాటు నెమ్మదిగా విడుదలవుతూ వచ్చిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. రసాయనం, మందు రెండూ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంట/వాపు కలిగిస్తున్న కణాల పెరుగుదలను అడ్డుకుంటూనే.. నాడీ సంబంధిత మూలకణాలు పెరిగేలా చేశాయని ఫలితంగా అక్కడ ఏర్పడ్డ న్యూరాన్ల నెట్‌వర్క్‌ మళ్లీ సంకేతాలు పంపడం మొదలుపెట్టడంతో కోతుల్లో కదలికలు కనిపించాయని వివరించారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top