
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
ఆశా... ఆ... ఒకే ఒక ఆశ అదే నా శ్వాస... ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
నేడు సాలూరి వాసూరావు బర్త్‌డే
పల్లవి :
ఆశా... ఆ...
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస...
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
కమ్మని కౌగిలి కోరితే దురాశ
తీయని పెదవులు కలిపితే ఓ నిషా
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
చరణం : 1
చెదిరిన పైటకు బహుమతిగా
చిలిపి ముద్దులు అందించనా
నలగని పువ్వుల నవ్వులతో
వలపు శుద్ధులు నేర్పించనా
కులుకులు తగవే నా అలకల చిలక
గడబిడి తగదోయ్ నా మగసిరి మొలక
పరువమే ఇలా ఇలా పిలిచె మరి
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
కమ్మని కౌగిలి కోరితే దురాశ
తీయని పెదవులు కలిపితే ఓ నిషా
ఒకే ఒక ఆశ అదే నా శ్వాస
చరణం : 2
మదనుడు మరచిన శరములేవో వెలికితీశా నీ కోసమే
చల్లని వెన్నెల పల్లకిలో ఎదురుచూశా నీ కోసమే
తరగని కలలే రా రమ్మని పిలువా
తమకపు ఒడిలో చోటిమ్మని అడిగా
సొగసరీ సరాసరీ పదవే మరీ
॥ఒక॥
చిత్రం : సూరిగాడు (1992)
రచన : భువనచంద్ర
సంగీతం : సాలూరి వాసూరావు
గానం : ఎస్.పి.బాలు, చిత్ర